దేశంలో 44 లక్షలు దాటిన కరోనా కేసులు..

180
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 95,735 కేసులు నమోదుకాగా 1172 మంది కరోనాతో మృతిచెందారు.

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,65,864కి చేరగా కరోనాతో ఇప్పటివరకు 75,062 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 9,19,018 యాక్టివ్ కేసులుండగా 34,71,784 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

దేశంలో ఒకేరోజులో కేసుల సంఖ్య 90వేలకు పైగా నమోదు కావడం ఇది నాలుగోసారి. ఇక ఇప్పటివరకు కరోనా టెస్టుల సంఖ్య 5 కోట్లు దాటాయి.