17న ఎంగిలిపూల బతుకమ్మ..

181
bathukamma

ఈ నెల 17న ఎంగిలిపూల బతుకమ్మ పండగ నిర్వహణ కోసం ప్రభుత్వం ఏర్పాట్లుచేయాలని ప్రభుత్వాన్ని కోరింది తెలంగాణ బ్రహ్మణ సేవా సమితి. ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసిన బ్రహ్మణ సేవా సమితి గౌరవాధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ,రాష్ట్ర పురోహిత సంఘం కన్వీనర్ తాండ్ర నాగేంద్రశర్మ.

ఈ ఏడాది అధిక ఆశ్వీయుజ మాసం వచ్చినందున బతుకమ్మ పండుగపై హిందువుల్లో కొంత సందిగ్ధం ఏర్పడిందని … పెద్దల అమావాస్యనాడు పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడంతోపాటు ఎంగిలిపూల బతుకమ్మ నిర్వహించడం మన ఆచారమని పేర్కొన్నారు.

అక్టోబర్‌ 17న బతుకమ్మ పేర్చి నాటినుంచి 24వ తేదీన దుర్గాష్టమి వరకు బతుకమ్మను ఎనిమిది రోజులు పేర్చి, పూజించి జానపదాలతో ఆడి నిమజ్జనం చేయాలని సూచించారు.