19 లక్షలు దాటిన కరోనా కేసులు…

44
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకి 50 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 19 లక్షలు దాటింది.

ఇప్పటివరకు 19,08,254 కేసులు నమోదుకాగా గత 24 గంటల్లో 52,509 కేసులు నమోదుకాగా 857 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 5,86,244 యాక్టివ్ కేసులుండగా కరోనా మహమ్మారి నుండి 12,82,215 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

39,795 మంది కరోనాతో మరణించగా ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 67.19 శాతంగా ఉంది. ఇక ఇప్పటివరకు దేశంలో కరోనా టెస్టుల సంఖ్య 2 కోట్లు దాటగా రోజుకు 5 లక్షలకు పైగా టెస్టులు చేస్తున్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.