వర్మ దారిలోనే దర్శకుడు తేజ..!

66
rgv

నేనే రాజు నేనే మంత్రితో దర్శకుడిగా తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకున్న తేజ ప్రస్తుతం వరుస సినిమాలతో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఓ వైపు వెండితెర…మరోవైపు వెబ్ సిరీస్‌లో ప్రేక్షకులను అలరిస్తానని అంటున్నాడు.

అయితే తేజ తీయబోయే వెబ్‌ సిరీస్‌లు దర్శకుడు ఆర్జీవీ బాటలోనే బోల్డ్ కంటెంట్‌తో ఉండనున్నాయట. తన వద్ద సుదీర్ఘ కాలంగా సహాయ దర్శకుడిగా చేస్తున్న రాజేష్ తో ఈ వెబ్ మూవీని తేజ నిర్మించాడట. ఇందుకు గాను కథను మరియు స్క్రిప్ట్ ను స్వయంగా తేజానే ఇచ్చాడట. గంట నిడివి ఉండేలా రాజేష్ సినిమాను తెరకెక్కించాడు. నైజాం కాలం నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ బోల్డ్ కంటెంట్ తో ఉంటుందని తెలుస్తుంది .

ప్రస్తుతం గోపీచంద్ తో అలిమేలుమంగ వెంకటరమణ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత రానాతో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉంది.