- Advertisement -
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18 లక్షలు దాటాయి. రోజుకు 50 వేలకు పైగా కేసులు నమెదవుతుండటంతో కొద్దిరోజుల్లో 18 లక్షల మార్క్‌ను దాటాయి కరోనా కేసులు.
గత 24 గంటల్లో 52,972 పాజిటివ్ కేసులు నమోదుకాగా 771 మంది మరణించారు. ఇక ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 18,03,696కు చేరగా 5,79,357 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా మహమ్మారి నుండి 11,86,203 కోలుకోగా ఇప్పటివరకు 38,135 మంది మృత్యువాతపడ్డారు.
ఇప్పటివకు దేశంలో 2,02,02,858 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని…. నిన్న ఒకే రోజు 3,81,027 నమూనాలను పరీక్షించామని తెలిపింది ఐసీఎంఆర్.
- Advertisement -