రాష్ట్రంలో 67 వేలకు చేరువలో కరోనా కేసులు..

80
coronavirus

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67 వేలు దాటాయి. గత 24 గంటల్లో 1819 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66,677కు చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 18,547 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 47,590 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 540 మంది మృత్యువాతపడ్డారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 517 పాజిటివ్ కేసులు ఉండగా రంగారెడ్డి జిల్లాలో 181, మేడ్చ‌ల్ జిల్లా‌లో 146, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 138 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు 71.3 శాతం, మ‌ర‌ణాల రేటు 0.80 శాతంగా ఉంది.