11 లక్షలు దాటిన కరోనా కేసులు…

260
coronavirus cases
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11 లక్షలు దాటింది. రోజుకు 35 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తుండగా రానున్న రోజుల్లో కరోనా మరింత ఉగ్రరూపం దాల్చనుంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

గత 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో కొత్త‌గా 40,425 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇప్పటివరకు 11,18,043 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల్లో 681 మంది మృతిచెందగా ఇప్పటివరకు 27,497 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,90,459గా ఉండగా 7,00,087 మంది కరోనా నుండి కోలుకున్నారు.

ఇప్పటివరకు దేశంలో 1 కోటి 40 లక్షల 47 వేల 908 మందికి కరోనా టెస్టులు చేయగా ఆదివారం ఒక్కరోజే 2,56,039 టెస్టులు చేసినట్లు ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్ (ఐసీఎమ్మార్‌) తెలిపింది. గత నాలుగు రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు 1.30 ల‌క్ష‌ల దాటడం విశేషం.

- Advertisement -