కరోనాతో మృతిచెందిన డాక్టర్లు ఎంతమందో తెలుసా..?

146
covid 19
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,07,66,245గా ఉండగా ఇప్పటివరకు కరోనాతో 162 మంది డాక్టర్లు మృతి చెందినట్లు కేంద్రం వెల్లడించింది. పార్లమెంట్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేంద్రం… జ‌న‌వ‌రి 22 నాటికి క‌రోనా వైర‌స్ వ‌ల్ల 107 మంది న‌ర్సులు, 44 మంది ఆశా వ‌ర్క‌ర్లు కూడా ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలిపింది.

గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 8,635 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని …ఇప్పటి వరకు 1,04,48,406 మంది కోలుకున్నారని మంత్రిత్వశాఖ పేర్కొంది. మృతుల సంఖ్య 1,54,486కు పెరిగింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 39,50,156 మందికి టీకాలు వేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.

- Advertisement -