దేశంలో 24 గంటల్లో 14,545 కరోనా కేసులు

71
covid

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశంలో 14,545 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 163 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,06,25,428కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో 1,88,688 యాక్టివ్ కేసులుండగా 1,02,708 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1,53,032 మంది మృతిచెందారు. కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌లో ఇప్పటి వరకు 10,43,534 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.