ఆదర్శంగా సూర్యాపేట మున్సిపాలిటీ: జగదీష్ రెడ్డి

33
Minister Jagadish Reddy

దేశానికే ఆదర్శంగా సూర్యాపేట మున్సిపాలిటీ నిలిచిందన్నారు మంత్రి జగదీష్‌ రెడ్డి. స్వచ్ఛ సర్వేక్షన్.. స్వచ్ఛ సూర్యపేట కార్యక్రమంలో భాగంగా సూర్యపేట పట్టణంలోని సద్దల చెరువు మినీ ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన 2కే రన్‌లో మంత్రి పాల్గొన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ తడి, పొడి చెత్తను వేరుచేసి సేంద్రియ ఎరువును తయారుచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. 2కే రన్‌లో పాల్గొని స్వచ్ఛ సూర్యపేట కోసం ప్రతిన బూనిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన జగదీష్ రెడ్డి… ప్రతి ఒక్కరిలో మొక్కలు నాటి సంరక్షించాలన్న తపన పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం హరిత తెలంగాణగా మారిందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలోని పట్టణాలన్నీ సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయని, ప్రతి ఒక్కరు మొక్కలు పెంచుకుంటున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.