ఐపీఎల్ 2021..సీఎస్‌కేలోకి ఉతప్ప

89
uthappa

ఐపీఎల్ 2021 ..14వ సీజన్ వేలం ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ట్రేడ్ రూపంలో ఉతప్పని సొంతం చేసుకుంది సీఎస్‌కే. షేన్ వాట్సన్‌, హర్భజన్ సింగ్, పీయూస్ చావ్లా, మురళీ విజయ్, కేదార్ జాదవ్, మోనూ సింగ్‌‌లను వేలంలోకి విడిచిపెట్టిన చెన్నై ఉతప్పని సొంతం చేసుకుంది.

సీజన్‌ 13లో రూ.3 కోట్లకి రాబిన్ ఉతప్పని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2021 సీజన్ వేలం ఫిబ్రవరి రెండో వారంలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ 2020 సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన రాబిన్ ఉతప్ప .. 16.33 సగటుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. వాట్సన్ స్ధానాన్ని రాబిన్ ఉతప్పతో భర్తీ చేయనుంది చెన్నై. ఐపీఎల్‌ కెరీర్‌లో ఇప్పటి వరకూ 189 మ్యాచ్‌లు ఆడిన ఉతప్ప.. 129.99 స్ట్రైక్‌రేట్‌తో 4,607 పరుగులు చేశాడు.