దేశంలో 24 గంటల్లో 19,556 కరోనా కేసులు…

83
india corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24గంటల్లో దేశంలో కొత్తగా 19,556 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 301 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,75,116కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో 2,92,518 యాక్టివ్ కేసులుండగా 96,36,487 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1,46,111 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 10,72,228 శాంపిల్స్‌ పరీక్షించగా ఇప్పటి వరకు 16,31,70,557 నమూనాలను పరిశీలించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.