ముస్త్యాల సర్పంచ్ ని అభినందించిన ఎమ్మెల్సీ కవిత

41
mlc kavitha

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల సర్పంచ్ రామగిరి లావణ్యను అభినందించారు ఎమ్మెల్సీ కవిత. మధ్యప్రదేశ్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ స్టార్ రికార్డ్స్ సంస్థ.. సర్పంచ్ లావ‌ణ్య‌ చేస్తున్న సామాజిక కార్యక్రమాలను గుర్తించి “ప్రేరణ” అవార్డును అందజేయగా విషయం తెలుసుకున్న కవిత…లావణ్యకు ఫోన్ చేసి అభినందించారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం సేవలు అందిస్తున్న లావణ్య మరింత కాలం ప్ర‌జాసేవ‌లో కొన‌సాగాల‌ని ఆమె ఆకాంక్షించారు.చిన్న వయసులో పెద్ద మనసుతో సేవలు అందించడం అభినందనీయమన్నారు.