దేశంలో 97 శాతానికి పెరిగిన రిక‌వ‌రీ రేటు

53
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పడతాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 37,154 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 724 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,08,74,376కి చేరగా 4,50,899 యాక్టివ్ కేసులున్నాయి.

కరోనాతో ఇప్పటివరకు 4,08,764 మంది చనిపోగా 3,00,14,713 మంది కోలుకున్నారు. క‌రోనా రిక‌వ‌రీ రేటు 97.22 శాతానికి పెరగగా ఇప్ప‌టి వ‌ర‌కు 37.73 కోట్ల‌కు పైగా టీకా డోసుల పంపిణీ జ‌ర‌గ‌గా, గ‌డిచిన 24 గంట‌ల్లో 12,35,287 మంది టీకాలు వేయించుకున్నారు.