వామిక ఫోటోలను షేర్ చేసిన అనుష్క..!

80
virat

తన ముద్దుల కూతురు వామిక ఫోటోలను షేర్ చేశారు బాలీవుడ్ బ్యూటీ అనుష్క. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వామిక ఫోటోలను షేర్ చేసిన అనుష్క…మా వ్యక్తిగత జీవితాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నామని, త్వరలోనే పాప గురించి చెబుతామని అన్నారు. కొద్ది రోజుల త‌ర్వాత త‌న కూతురికి వామిక అనే పేరు పెట్టిన‌ట్టు తెలియ‌జేసిన విరుష్క దంప‌తులు పాప ఫేస్ ఎక్క‌డా రివీల్ కాకుండా జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో అనుష్క శ‌ర్మ పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. తమ బిడ్డకు వామిక అనే పేరు పెట్టగా వామిక అంటే దుర్గా మాత. నా చిన్న పాప ఒక్క నవ్వుతో మా ప్రపంచం మొత్తాన్ని మార్చేసింది.. నువ్ మమ్మల్ని అలా చూస్తుంటే మా ఈ జీవితాలను ఇలా హాయిగా గడిపేయోచ్చు అంటూ అనుష్క పేర్కొనగా నెటిజన్లు సైతం విషెస్ చెబుతున్నారు.