మళ్లీ పెట్రో వాత…

214
diesel

పెట్రోల్ ధరల పెరుగుదల ఆగడం లేదు. రోజువారి సమీక్షలో భాగంగా పెట్రోల్‌ ధరలను పెంచిన చమురు కంపెనీలు డిజిల్ ధరలను మాత్రం కాస్త తగ్గించాయి. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్‌పై రూ. 29 పైస‌లు పెర‌గ‌గా, డీజిల్‌పై రూ. 17 పైస‌లు త‌గ్గింది.

పెట్రోల్ ధరల పెరుగుదలతో హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 105.15 కాగా, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 97.79గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధ‌ర రూ. 107.20, డీజిల్ 97.29, భోపాల్‌లో పెట్రోల్ ధ‌ర రూ. 109.53, డీజిల్ ధ‌ర రూ. 98.50గా ఉంది. ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 101.19, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 89.72గా ఉండగా కోల్‌క‌తాలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 101.35 కాగా, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 92.81గా ఉన్నాయి.