దేశంలో 24 గంటల్లో 76,472 కరోనా కేసులు..

183
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య రికార్డు స్ధాయిలో 75 వేలు దాటాయి. గత 24 గంటల్లో 76,472 కరోనా కేసులు నమోదుకాగా 1021 మంది మృత్యువాతపడ్డారు.

దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 34,63,973కు చేరగా 26,48,999 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 7,52,424 యాక్టివ్ కేసులున్నాయి. 62,550 మంది కరోనాతో మృతిచెందారు.

దేశ‌ంలో ఇప్పటివరకు కరోనా టెస్టుల సంఖ్య 4 కోట్లకు చేరువ కాగా రోజుకు 10 లక్షల టెస్టులు చేస్తున్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది.