రాష్ట్రంలో 24 గంటల్లో 2751 కేసులు…

99
coronavirus

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 20 వేలు దాటాయి. గత 24 గంటల్లో 2,751 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 9 మంది మృతిచెందారు.దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,20,166కి చేరగా ఇప్పటివరకు 808 మంది కరోనాతో మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,008 యాక్టివ్ కేసులుండగా 89,350 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు.

24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే జీహెచ్‌ఎంసీలో 432, కరీంనగర్‌ 192, రంగారెడ్డి 185, నల్గొండ 147, ఖమ్మం 132, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 128, నిజామాబాద్‌ 133, సూర్యాపేఏట 111, వరంగల్‌ అర్బన్‌ 101 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.67శాతంగా ఉందని, ఇది దేశ సగటు (1.81శాతం) కంటే ఎక్కువని తెలిపింది.