అధైర్యపడకండి…నేనున్నా: ఎర్రబెల్లి

117
errabelli

మీ ధైర్యమే..మిమ్మల్ని కరోనా నుండి కాపాడుతుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అధైర్య ప‌డ‌కండి… నేనున్నాను అని కరోనా బాధితుల్లో ధైర్యం నింపారు. కరోనా మనల్ని ఏం చేయదు…..క‌రోనా ని ధైర్యంగా ఎదుర్కొందాం అన్నారు.

తిండికి ఇబ్బంది ఉన్నవాళ్లను ఆదుకోవాలి….కరోనా అంబులెన్స్ లు పాలకుర్తి, తొర్రూరు లో అందుబాటు లోకి వస్తాయన్నారు. ఆరోగ్యం బాగుందా..? వైద్యం అందుతోందా?…ప్ర‌భుత్వ వైద్య‌శాల‌ల్లో అద్భుత‌మైన వైద్య సేవ‌లు అందుతున్నాయని చెప్పారు.

రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుకుంటే చాలు..స్వీయ నియంత్ర‌ణ‌, సామాజిక దూరం, మాస్కులు ధ‌రిస్తే మంచిదన్నారు. క్వారంటైన్ త‌ర్వాత కూడా ఉచితంగా ప‌రీక్ష‌లు జ‌రిగేలా చ‌ర్య‌లు…హాస్పిట‌ల్స్ ‌, హోం క్వారంటైన్ ల‌లో ఉన్న క‌రోనా బాధ‌తులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఆధికారులతో టెలీ కాన్ఫ‌రెన్స్ లో మాట్లాడారు.