భారత్‌లో తగ్గని కరోనా విజృంభణ..

193
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకి 60 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటంతో ఇప్పటివరకు కేసుల సంఖ్య 32 లక్షలకు చేరువయ్యాయి.

గత 24 గంటల్లో 61,408 కరోనా కేసులు నమోదు కాగా 836 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో 31,06,348 కేసులు నమోదుకాగా 57,542 మంది మృత్యువాతపడ్డారు.

ప్రస్తుతం దేశంలో 7,10,771 యాక్టివ్ కేసులు ఉండగా 23,38,035 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు దేశంలో 3.5 కోట్ల మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.