యూఏఈ చేరుకున్న ఐపీఎల్ ప్రాంఛైజీలు..

207
ipl

సెప్టెంబర్ 19 నుండి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. భారత్‌లో కరోనా టెస్టులు పూర్తి చేసుకున్న అన్ని ప్రాంఛైజీల ఆటగాళ్లు యూఏఈ చేరుకున్నారు. ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌), ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ) దుబాయ్ కి చేరుకున్నాయి.

ఈ రెండు జట్లు దుబాయ్‌కి చేరుకోవడంతో ఐపీఎల్ లో పాల్గొనే అన్ని జట్లు అక్కడికి వెళ్ళినట్లే. సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు దుబాయ్,అబుదాబి, షార్జా మూడు వేదికల్లో ఐపీఎల్ జరగనుంది.

కరోనా నేపథ్యంలో ఆటగాళ్లకు పలు ఆంక్షలు విధించింది బీసీసీఐ. కరోనా నేపథ్యంలో ఆటగాళ్లు మైదానంలో ఒకరినొకరు కరచాలనం చేసుకోవడం,బంతికి ఉమ్మి రుద్దడం వంటివి చేయకుండా ఆంక్షలు విధించింది.