- Advertisement -
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 60 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో 25 లక్షలకు కరోనా కేసులు చేరువయ్యాయి.
గత 24 గంటల్లో 64,553 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 1007 మంది మృతిచెందారు. ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 24,61,191కు చేరగా ప్రస్తుతం దేశంలో 6,61,595 యాక్టివ్ కేసులున్నాయి.
కరోనా మహమ్మారితో 48,040 మంది మృతిచెందగా 17,51,556 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 8,48,728 కరోనా టెస్టులు చేయగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,76,94,416 నమూనాలను పరీక్షించామని ఐసీఎంఆర్ తెలిపింది.
- Advertisement -