42 లక్షలకు చేరువలో కరోనా కేసులు..

181
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. రోజుకు 90 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా 42 లక్షలకు కరోనా కేసులు నమోదవుతున్నాయి.

గ‌త 24 గంట‌ల్లో 90,633 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 1,065 మంది మ‌ర‌ణించారు. ప్రస్తుతం దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 41,13,812కు చేరగా 70,626 మంది మృతిచెందారు.ప్రస్తుతం దేశంలో 8,62,320 యాక్టివ్ కేసులుండగా 31,80,866 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 77.23 శాతంగా ఉండగా, మ‌ర‌ణాల రేటు 1.73 శాతంగా ఉంద‌ని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

నిన్న ఒక్క‌రోజే దేశ‌వ్యాప్తంగా 10,92,654 మంది క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా సెప్టెంబ‌ర్ 5 వ‌ర‌కు 4,88,31,145 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధాన మండ‌లి (ఐసీఎమ్మార్‌) వెల్లడించింది.