కరోనా వేళ ఆటగాళ్లకు ముంబై టీమ్ గిఫ్ట్స్‌!

169
ipl

కరోనా కారణంగా ఐపీఎల్ 13వ సీజన్‌ యూఏఈలో జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 నుండి టోర్నీ ప్రారంభంకానుండగా అన్ని ప్రాంఛైజీలు ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

ఇందులో భాగంగా ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ ఆటగాళ్లకు ఉంగరాలు బహుమతిగా ఇచ్చింది. అయితే ఈ మధ్య కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఎక్కువగా కరోనా లక్షణాలు కనిపించడం లేదు. అందుకే ఎంఐ తమ ఆటగాళ్లకు స్మార్ట్ ఉంగరాలు ఇచ్చింది.

వీటితో ఆటగాళ్ల గుండె వేగం, శ్వాసలో హెచ్చుతగ్గులు, శరీర ఉష్ణోగ్రతలకు సంబంధించిన సమాచారాన్ని స్వేకరించవచ్చు. ఐపీఎల్ షెడ్యూల్‌ ఇవాళ రిలీజ్ కానుంది.