కాంగ్రెస్‌,బీజేపీతో ప్రయోజనం శూన్యం: హరీశ్‌

148
harish rao

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది టీఆర్ఎస్‌. టీఆర్ఎస్ అభ్యర్ధి తరపున దుబ్బాక మండలం రామక్కపేటలో ప్రచారం నిర్వహించారు హరీశ్‌ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌, బీజేపీల‌తో రాష్ర్ట ప్ర‌జ‌ల‌కు ఒరిగేదేమీ లేద‌న్నారు.

రాష్ర్టంలో బీజేపీకి ఉన్న‌ది ఒక్క‌టే ఎమ్మెల్యే.. ఆ పార్టీతో ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌నం లేద‌న్నారు. ఎన్నిక‌ల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ అమ‌లు చేయ‌లేద‌ని గుర్తు చేశారు. తెలంగాణ నీటి క‌ష్టాలు తీర్చింది కేవ‌లం సీఎం కేసీఆర్ మాత్ర‌మేన‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రూ. 2 వేల పెన్ష‌న్ ఇస్తున్నారా? ‌పేదింటి ఆడ‌పిల్ల‌ల వివాహాల‌కు ఆర్థిక సాయం చేస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీలు అర‌చేతిలో వైకుంఠం చూపిస్తున్నాయ‌ని హరీశ్‌ మండిపడ్డారు.