హ్యాపీ బర్త్ డే….బ్రాండ్ బాబు మారుతి

140
maruthi

టాలీవుడ్‌లో చిన్న సినిమాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు మారుతి. మొదట్లో యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలను తెరకెక్కిస్తూ వచ్చిన మారుతి, ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.భలే భలే మగాడివోయ్ సినిమాతో రూట్ మార్చిన మారుతి సీనియర్ హీరోగా వెంకటేష్ హీరోగా బాబు బంగారంతో పరవాలేదనిపించాడు. తర్వాత శర్వానంద్ హీరోగా మహానుభావుడు సినిమాతో మెప్పించాడు. ఇవాళ బ్రాండ్ బాబు మారుతి బర్త్ డే సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది greattelangaana.com.

బన్నీ వాసుతో ఉన్న పరిచయంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మారుతి. ఆర్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేసే అవకాశం రావడం తర్వాత ఏ ఫిల్మ్ బై అరవింద్, ప్రేమిస్తే సినిమాలకు కో ప్రొడ్యూసర్‌గా చేశాడు. తర్వాత ఈ రోజుల్లో సినిమాతో సంచలనం సృష్టించాడు.

తర్వాత బాస్ స్టాప్ సినిమాతో హిట్ అందుకున్నారు. ఇక ప్రేమకథా చిత్రం, భలేభలే మగాడివోయ్ సినిమాతో ట్రెండ్ సెట్టర్‌గా మారారు. బాబు బంగారం , కొత్తజంట, మహానుభావుడు, శైలజ రెడ్డి అల్లుడు , ప్రతి రోజు పండగే వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్న మారుతి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని గ్రేట్ తెలంగాణ.కామ్ మనస్పూర్తిగా కొరుకుంటోంది.