దేశంలో 24 గంటల్లో 74,442 కరోనా కేసులు..

177
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. రోజుకు 70 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో కరోనా కేసుల సంఖ్య 66 లక్షలు దాటాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 74,442 మంది క‌రోనా బారిన పడగా మొత్తం కేసుల సంఖ్య 66,23,816కు చేరింది.

24 గంటల్లో కరోనాతో 903 మంది మృతిచెందగా 9,34,427 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 55,86,704 మంది క‌రోనా నుంచి కోలుకోగా 1,02,685 మంది మృత్యువాతపడ్డారు.