పెరిగిన బంగారం ధరలు..

176
gold rate

వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.140 పెరిగి రూ.52,900కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.130 పెరిగి రూ.48,500కు చేరింది.

బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం అక్కడే స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.61,200గా ఉంది. బంగారం ధర ఔన్స్‌కు 0.13 శాతం తగ్గుదలతో 1905 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.07 శాతం పెరుగుదలతో 24.03 డాలర్లకు చేరింది.