రాష్ట్రంలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు..

80
corona

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,335 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8 మంది మృతిచెందారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 611కు చేరింది.

కరోనా నుండి 1,72,388 మంది కోలుకోగా ప్రస్తుతం రాష్ట్రంలో 27,052 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 1,174 మంది కరోనాతో మృతిచెందారు.ఆదివారం రోజు రాష్ట్రవ్యాప్తంగా 36,348 కరోనా టెస్టులు నిర్వహించగా ఇప్పటివరకు టెస్టుల సంఖ్య 32 లక్షలు దాటాయి.