దేశంలో 62 లక్షలుదాటిన కరోనా కేసులు..

216
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 62 లక్షలు దాటాయి. గత 24 గంట‌ల్లో 80,472 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 1179 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 62,25,764 దాటాయి.

ప్రస్తుతం దేశంలో 9,40,441 యాక్టివ్ కేసులుండగా 51,87,826 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 97,497 మంది మృతిచెందారు.

ప్రస్తుతం దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు 83.33 శాతంగా ఉండగా మ‌ర‌ణాల రేటు 1.57 శాతంగా ఉంది. ఇప్పటివరకు 7,41,96,729 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేయగా గత 24 గంటల్లో 10,86,688 మందికి కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.