నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద…

111
Nagarjuna Sagar Dam

నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో సాగర్‌కు భారీగా నీరు చేరుతుండగా 14 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్ధాయి నీటినిల్వ సామర్ధ్యం 312.04 టీఎంసీలు కాగా ప్ర‌స్తుతం 311.74 టీఎంసీలు. సాగ‌ర్ పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 590 అడుగులు కాగా 589.90 అడుగుల మేర నీరుంది.

శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుండటంతో నాలుగు గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌స్తుతం 884.5 అడుగుల మేర నీరు నిల్వ ఉండగా 212.91 టీఎంసీల నీరుంది.