రాష్ట్రంలో 24 గంటల్లో 2103 కరోనా కేసులు..

38
corona

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 2,103 కరోనా కేసులు నమోదుకాగా 11 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,91,386కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 29,326 యాక్టివ్ కేసులుండగా 1,60,933 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 1127 మంది మృతిచెందారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 298,కరీనంగర్‌లో 103, భద్రాద్రి కొత్తగూడెం లో 102, మేడ్చల్ లో 176, నల్గొండలో 141, రంగారెడ్డిలో 172, వరంగల్ అర్బన్ లో 85 కేసులు కాస్త ఎక్కువగా నమోదయ్యాయి.