దేశంలో 55 లక్షలు దాటిన కరోనా కేసులు..

153
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 55 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 75,083 కొత్త కేసులు నమోదు కాగా.. 1,053 మంది మృతిచెందారు.

దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 55,62,664కు చేరగా 9,75,861 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 44,97,868 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 88,935 మంది కరోనాతో మృతిచెందారు.

గత 24 గంటల్లో 9,33,185 కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 6,53,25,779 టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.