బిగ్ బాస్ 4…ఓటింగ్‌ టాప్‌లో కుమార్ సాయి!

154
kumar sai

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 16 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. హాట్ హాట్‌గా సాగిన ఈ నామినేషన్ ప్రక్రియలో మూడో వారానికి సంబంధించి ఏడుగురు కంటెస్టెంట్లు యాంకర్ దేవి, లాస్య, అరియానా గ్లోరి, కుమార్ సాయి, మెహబూబ్, మోనాల్ గజ్జర్, హారికలు నామినేట్ అయ్యారు. ఈ ఏడుగురిలో ఒకరు వచ్చే వారం బ్యాగ్ సర్దేయనున్నారు.

మూడో వారం ఓటింగ్ ఇప్పటికే ప్రారంభంకాగా గత రెండు వారాల్లో లీస్ట్‌లో ఉన్న కుమార్ సాయి ఈ వారం అనూహ్యంగా టాప్ పొజిషన్‌లో నిలిచారు. ఇక ఎలిమినేషన్‌కి మొదటగా నామినేట్ అయిన దేవి లీస్ట్‌లో ఉంది.

కుమార్ సాయి 24 శాతం ఓట్లతో టాప్‌లో ఉండగా తర్వాత 21 శాతంతో హారిక,19 శాతంతో లాస్య,12 శాతంతో మొనాల్‌,7 శాతంతో మొహబూబ్,7శాతంతో అరియానా,7.05 శాతంతో దేవి నాగవల్లి ఉన్నారు.