శ్రీశైలంకు పెరిగిన వరద..సాగర్ 14 గేట్లు ఎత్తివేత

235
Nagarjuna Sagar Dam
- Advertisement -

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. శ్రీశైలానికి భారీగా వరద నీరు చేరుతుండటంతో ఇన్‌ ఫ్లో భారీగా పెరిగింది. 2,84,355 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా జలాశయం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగులు (215.8 టీఎంసీ)లు కాగా ప్రస్తుతం 884.5 అడుగులు (212.91) టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3,05,313 క్యూసెక్కులు, కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 33 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.

నాగార్జున సాగర్‌కు క్రమంగా ఇన్‌ ఫ్లో పెరుగుతుండటంతో 14 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.4 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589.20 అడుగులు (309.65 టీఎంసీలు) గా ఉంది.

జూరాల ప్రాజెక్టులకు వరద స్థిరంగా కొనసాగుతోంది. 26 గేట్లను ఎత్తి 2,16,626 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులు 9.657 (టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1044 అడుగులు (8.850 టీఎంసీలు)గా ఉంది.

- Advertisement -