దేశంలో 50 లక్షలు దాటిన కరోనా కేసులు..

199
corona

దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రస్తుతం కేసుల సంఖ్య 50 లక్షలు దాటాయి. గత 24 గంట‌ల్లో 90,123 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 1290 మంది మృతిచెందారు.

దేశంలో మొత్తం క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 50,20,360కు చేరగా 9,95,933 యాక్టివ్ కేసులున్నాయి. 39,42,361 మంది కరోనా నుండి కోలుకోగా 82,066 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. దేశంలో ఇప్పటివరకు 5,94,29,115 శ్యాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్లు ఐసీఎంఆర్ చెప్పింది.