- Advertisement -
దేశంలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఆదివారం ఒక్కరోజే 8,380 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఒక్కరోజులోనే ఇన్ని కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి.
ఇప్పటివరకు భారత్‌లో 190,609 కేసులు నమోదుకాగా ప్రపంచదేశాల్లో భారత్ ఏడో స్థానంలో నిలిచింది. 5,164 మంది మృత్యువాత పడగా 86,983 మంది వైరస్ నుండి కోలుకున్నారు.
దేశంలో మహారాష్ట్ర 65,168 కేసులతో తొలిస్ధానంలో ఉండగా ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే అమెరికా, బ్రెజిల్, రష్యా, స్పెయిన్, బ్రిటన్, ఇటలీ తొలి ఆరుస్ధానాల్లో ఉండగా భారత్ ఏడో స్ధానంలో ఉంది.
వైరస్ బాధితులను, వారితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించడంలో పలు రాష్ట్రాలు విఫలమవ్వడం కేసులు పెరగడానికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు వలస కూలీలను సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతించడం కూడా మరోకారణమని చెబుతున్నారు.
- Advertisement -