గల్లా అశోక్ యాక్టింగ్‌కు మహేష్ ఫిదా..!

402
mahesh babu
- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేశ్ మేనల్లుడు గల్లా అశోక్ నటిస్తున్న చిత్రం లుక్‌తో పాటు యమలీలో సినిమాలో కృష్ణ చేసిన సూపర్ హిట్ సాంగ్ జుంబారే రీమిక్స్ సాంగ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ పాటలో అశోక్ గల్లా అదిరిపోయే స్టెప్పులతో ఫ్యాన్స్‌ని అలరించాడు. ఈ నేపథ్యంలోనే మేనల్లుడిని ప్రశంసలతో ముంచెత్తారు మహేశ్.ఈ పాటలో ఎంత ఎనర్జీ ఉందో అంతా చూపించేశావు అంటూ అశోక్ ను అభినందించాడు. “తెరపై చక్కగా కనిపిస్తున్నావు, ఈ సినిమా చూడ్డానికి వేచి ఉండలేకపోతున్నాను. నీకు, చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. ఇలాగే ఊపేయాలి ” అంటూ పేర్కొన్నారు మహేశ్.

గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా హీరోగా శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.

- Advertisement -