భారత్‌ టార్గెట్‌ 265..

221
- Advertisement -

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌లోని బ‌ర్మింగ్‌హామ్ వేదిక‌గా టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది.బంగ్లాదేశ్ తో జరిగే సెమీస్ పోరులో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. కాని బంగ్లాదేశ్‌ ప్రదర్శన ఎప్పుడూ ఆసక్తికరమే! అంచనాలే లేకుండా బరిలోకి దిగుతారు. తమదైన రోజున తిరుగులేదనుకున్న జట్టుకు షాకిస్తారు! ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ న్యూజిలాండ్‌ను ఓడించి బంగ్లా అలాగే సెమీస్‌ చేరింది. జూన్‌ 15న సెమీస్‌లో కోహ్లీసేనతో అమీతుమీ తేల్చుకోనుంది. భారత్‌కు బంగ్లా సరైన పోటీదారు కాకున్నా వారి పోరాట పటిమను అభినందించకుండా ఉండలేం. ఎందుకంటే 2007 ప్రపంచకప్‌లో ఆ జట్టు టీమిండియాను ఓడించింది.!!

India chase 265 to enter final

అయితే ఇంగ్లండ్‌లో ఈ రోజు కొన‌సాగుతున్న‌ భార‌త్‌, బంగ్లాదేశ్ మ్యాచులో టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన‌ బంగ్లాదేశ్.. టీమిండియా ముందు 265 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌ సౌమ్య స‌ర్కార్ 0, ష‌బ్బిర్ 19, త‌మీమ్ 70, ర‌హీమ్ 61, షాకిబ్‌ 15, రియాద్ 21, మోస‌ద్దేక్ 15, మోర్టాజా 30 (నాటౌట్), టాస్కిన్ 11 (నాటౌట్) ప‌రుగులు చేశారు. బంగ్లాకి ఎక్స్‌ట్రాల రూపంలో 22 ప‌రుగులు వ‌చ్చాయి. దీంతో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 264 ప‌రుగులు చేసింది. భార‌త బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్, జాధ‌వ్‌, బుమ్రా రెండేసి వికెట్లు తీశారు. జ‌డేజాకి ఒక వికెట్ ద‌క్కింది.

- Advertisement -