- Advertisement -
వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది భారత్. మూడో వన్డేలో భారత్ 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 36 ఓవర్లకు కుదించగా భారత్ 257 పరుగుల లక్ష్యాన్ని విధించింది. లక్ష్యచేదనలో తడబడిన విండీస్ 137 పరుగులకు ఆలౌటైంది.
విండీస్ జట్టులో కెప్టెన్ నికోలస్ పూరన్ (32 బంతుల్లో 42 రన్స్), బ్రెండన్ కింగ్ (42) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో చాహల్ 4 వికెట్లు పడగొట్టగా శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు.
ఇక అంతకముందు టాస్ గెలిచిన భారత్ 256 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (58), శుభ్‌మన్ గిల్ (98) జట్టుకు మరోసారి శుభారంభాన్ని ఇచ్చారు. ప్లేయర్ ఆఫ్ సిరీస్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను శుభ్‌మన్ గిల్ సొంత చేసుకున్నాడు.
- Advertisement -