తప్పక గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో సత్తాచాటింది భారత్. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఆల్ రౌండ్ షో తో ఘన విజయం సాధించింది. భారత్ విధించిన 180 పరుగుల లక్ష్యచేధనలో 19.1 ఓవర్లలో కేవలం 131 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 48 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా 5 మ్యాచ్‌ల సిరీస్ ఆశలను సజీవం చేసుకుంది
దక్షిణాఫ్రికా బ్యాటర్లలో క్లాసెన్ (29) టాప్ స్కోరర్. హెన్రిక్స్ (23), ప్రిటోరియస్ (20), బవుమా (8), డసెన్ (1), డేవిడ్ మిల్లర్ (3), కేశవ్ మహరాజ్ (11), రబాడ (9), నార్జ్ (0), షంసి (0) పరుగులు చేశారు. హర్షల్ పటేల్ 4 వికెట్లు ,యజువేంద్ర చాహల్ మూడు వికెట్లు పడగొట్టాడు.
ఇకఅంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (57; 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (54; 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో రాణించగా చివర్లో హార్ధిక్ మెరుపులు మెరిపించడంతో భారీ స్కోరు సాధించింది.