టీమిండియాపై ఇంగ్లాండ్‌ ఘనవిజయం

231
ind
- Advertisement -

మోడీ స్టేడియం వేదికగా భారత్‌తో జరిగిన తొలి టీ20లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రతిభతో అన్నిరంగాల్లో స్పష్టమైన ఆధిక్యత కనబర్చిన ఇంగ్లాండ్‌…కోహ్లీ సేనను 8 వికెట్ల తేడాతో ఓడించింది. టీం ఇండియా విధించిన 125 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఛేదించింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 124/7 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. శ్రేయాస్ అయ్యర్ మాత్రమే హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్..130/2 పరుగులను కేవలం 15.3 ఓవర్లలోనే చేసింది. జేసన్ రాయ్‌ 49 పరుగులు, బట్లర్‌ 28 పరుగులు ఔట్‌ కాగా.. బెయిర్‌ స్టో 26 పరుగులు, మలన్‌ 24 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించారు.

- Advertisement -