ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకొని భారత్‌కు 264 పరుగుల లక్ష్యన్ని ఇచ్చింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 265 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 59 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బరిలోకి దిగిన కెప్టెన్ కోహ్లీ.. రోహిత్ శర్మతో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. రోహిత్ (123), కోహ్లీ (96))లు బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. చివర్లో బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఒక దశలో కోహ్లీ కూడా సెంచరీ చేయడం ఖాయమనిపించింది. అయితే సెంచరీ కంటే విజయానికి కావాల్సిన పరుగులు తక్కువ కావడంతో విరాట్ సెంచరీ ఆశ నెరవేరలేదు. 41 వ ఓవర్ తొలి బంతిని ఫోర్ కొట్టిన కోహ్లీ భారత్‌కు అపరూప విజయాన్ని అందించాడు. ఆదివారం జరగనున్నఫైనల్లో పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది.
స్కోర్లు:
బంగ్లాదేశ్ 264/7,భారత్ 265/1 (40.1 ఓవర్లలో)
భారత్ బ్యాటింగ్: రోహిత్ శర్మ-123 (నాటౌట్), కోహ్లీ- 96 (నాటౌట్), ధావన్-46
బంగ్లాదేశ్ బౌలింగ్ : మొర్తజా ఒక వికెట్ ,మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్: రోహిత్ శర్మ