సమంత సపోర్టుతో కోలీవుడ్‌ ఎంట్రీ..

186
Naga Chaitanya Kollywood Entry with Samantha
- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్‌ ప్రేమపక్షులు ఎవరైన ఉన్నారా అంటే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది సమంత నాగచైతన్యలే. ఈ జంట గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్‌ వీరిద్దరి పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో వీరి ఎంగేజ్మ్‌మెంట్ కూడా జరిగింది. మరి వీరి వివాహం అక్టోబర్‌లో జరగనుంది. అయితే ఇప్పుడు నాగచైతన్యకు సంబంధించిన ఆసక్తికర సమాచారం ఒకటి ఇండస్ట్రీలో ఇప్పడు వినిపిస్తోంది. అయితే ముందుగా అనుకున్న దాని ప్రకారం చైతూ కోలీవుడ్ ఎంట్రీ ఇప్పటికే జరిగిపోవాలి. కానీ అది జరగలేదు. గతంలో మాదిరి హీరోలు ఒక భాషకే పరిమితం కాకుండా.. మిగిలిన వుడ్ లపైనా దృష్టి పెడుతున్నారు. తమ ఇమేజ్ ను పెంచుకుంటే మార్కెట్ పెరగటంతో పాటు అన్ని కలిసి వస్తాయని అలోచిస్తున్నారు.

Naga Chaitanya Kollywood Entry with Samantha

అయితే చైతు సినిమాలకు ఇప్పుడిప్పుడే మార్కెట్ పెరుగుతుంది..మరి ఈ మార్కెట్‌ని మరింత పెంచె దిశలో చైతు ఆలోచిస్తున్నాడు. అయితే వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనైనా కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారట. ఇందులో భాగంగా తన కాబోయే భార్య సహకారం తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. తమిళ్ లో సమంతకు మంచి మార్కెట్టే ఉంది. ఇప్పటికే ఆమె పలువురు తమిళ అగ్ర హీరోలతో జత కట్టింది. తమిళ్ లో సమంతకు ఉన్న పాపులార్టీని వినియోగించుకొని తన ఎంట్రీని ఆసక్తికరంగా మల్చుకోవాలని చైతూ ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

అయితే ఈ ఏడాది ఆక్టోబరు 6 మ్యారేజ్ అయ్యాక కాస్త గ్యాప్ తీసుకొని.. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల్ని పూర్తి చేయాలని చైతూ భావిస్తున్నాడట. వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లో సమంతో కలిసి తన కోలీవుడ్ ఎంట్రీని గ్రాండ్ గా ఉండేలా చూస్తున్నట్లు చెబుతున్నారు.మరి కోలీవుడ్‌లో మనవాడి మార్కెట్‌ ఏరేంజ్‌లో ఉండబోతుందో ఇంక కొంతకాలం వేచిచూడాలి మరి.

- Advertisement -