దూబే విధ్వంసం..పాండ్యా స్థానం గల్లంతే?

28
- Advertisement -

టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో తన ఆల్రౌండ్ ప్రదర్శనతో శివం దూబే అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. మొదటి టీ20 మ్యాచ్ లో 60 పరుగులతో వీరవిహారం చేసి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించిన దూబే రెండో మ్యాచ్ లో కూడా అదే విధ్వంసం కొనసాగించాడు. రెండో టీ20 మ్యాచ్ లో 63 పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు కూడా పడగొట్టి ఆఫ్గన్ పాతనాన్ని శాసించాడు. మొదట బ్యాటింగ్ చేసిన నిర్ణీత ఓవర్లలో 172 పరుగులు చేసి ఆలౌట్ గా నిలిచింది. .

అఫ్గాన్ బ్యాట్స్ మెన్స్ లలో గుల్బదిన్ నాయిబ్ ( 57 ) మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు. ఇక లక్ష్య చేధనలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (0) ఈసారి కూడా నిరాశపరిచాడు. కానీ మరో ఓపెనర్ జైస్వాల్ ( 68 ) వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ ( 29 ) పరుగులు చేసి అవుట్ అయినప్పటికి శివం దూబే ( 63 ) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. జైస్వాల్, దూబే చెలరేగడంతో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 2-1 తేడాతో భారత్ ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకుంది. ఇక ఇరు జట్ల మద్య మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 17 న జరగనుంది.

పాండ్య స్థానంలో దూబే

ఈ టీ20 సిరీస్ లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న దూబేకు ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ లో చోటు కల్పించాలనే టాక్ క్రీడా వర్గాల్లో వినిపిస్తోంది. కేవలం బ్యాటింగ్ లో మాత్రమే కాకుండా బౌలింగ్ లో కూడా దూబే రాణిస్తుండడంతో అల్ రౌండ్ జాబితా లో హర్ధిక్ స్థానంలో దూబే కు చోటు కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా హర్డిక్ పాండ్య గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. టీ20 వరల్డ్ కప్ కూడా హర్ధిక్ పాండ్యా అందుబాటులో ఉంటాడా లేదా అనేది డౌటే. మరి హర్ధిక్ స్థానంలో దూబేకు చోటు కల్పిస్తారేమో చూడాలి.

Also Read:సంక్రాంతి విజేత హనుమాన్

- Advertisement -