టీడీపీ జనసేన ఫైనల్ మేనిఫెస్టో.. రెడీ ?

17
- Advertisement -

ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఇరు పార్టీల అధినేతలు కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సీట్ల సర్దుబాటుపై కూడా అధినేతలు తుది నిర్ణయానికి వచ్చినట్లు వినికిడి. దాంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టోపై కూడా పవన్, చంద్రబాబు దృష్టి సారిస్తున్నారట. ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ పేరిట మినీ మేనిఫెస్టోను ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో పాటు అధినేత పవన్ కూడా షణ్ముఖ వ్యూహం పేరుతో కొన్ని హామీలను వారాహి యాత్రలో ప్రకటించారు. ఇప్పుడు ఓవరాల్ గా అటు జనసేన మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఇటు టీడీపీలోని కీలక హామీలను కలిపి మొత్తం 12 హామీలను కూటమిలో భాగంగా సిద్దం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 12 హామీలలో సంక్షేమం, ఉపాధి, అభివృద్ధి సమపాళ్ళలో ఉండేలా సిద్ధం చేసినట్లు టాక్. .

వీలైనంత త్వరగా మేనిఫెస్టోను ప్రకటించి విస్తృతంగా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పవన్, చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతి తర్వాత అభ్యర్థుల ప్రకటన కంటే ముందే ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి, 18 ఏళ్ళు నిండిన మహిళకు నెలకు రూ.1500, రైతులకు రూ.20 వేలు పెట్టుబడి సాయం, ఇలా ఆయా హామీలను హైలెట్ చేస్తూ సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ హడావిడి చేస్తోంది. అటు జనసేన అభివృద్దే లక్ష్యంగా షణ్ముఖ వ్యూహాన్ని సంధించారు పవన్. మరి పవన్ చంద్రబాబుల కలయికలో ఫైనల్ మేనిఫెస్టో ఎలా ఉండబోతుందనే చర్చ ప్రధానంగా జరుగుతోంది. మరి ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయిన ఉమ్మడి మేనిఫెస్టో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

Also Read:పిక్ టాక్ : హాట్ షూట్స్ తో మెస్మరైజింగ్ ఫోజులు

- Advertisement -