కన్ఫ్యూజన్ కు చెక్.. కూటమి ప్లాన్ అదే !

33
- Advertisement -

మోడిని గద్దె దించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి విధితమే. ఈసారి ఎలాగైనా బీజేపీకి చెక్ పెట్టి తాము అధికారంలోకి రావాలని గట్టి ప్రణాళికలు వేస్తోంది ఇండియా కూటమి. ఇప్పటికే కూటమిలో 26 పార్టీలు ఉండగా ఈ సంఖ్య ఇంక పెరిగే అవకాశం ఉంది. ఐతే కూటమిగా ఏర్పడినప్పటికి విపక్షాలలో కన్ఫ్యూజన్ అలాగే ఉంది. ఎందుకంటే పి‌ఎం అభ్యర్థి ఎవరు ? ఏ ఏ సీట్లలో ఎవరు పోటీ చేయాలి ? అనే అంశాలపై స్పష్టత లేకపోవడమే అందుకు కారణం. దాంతో ఇప్పుడు ఆ అంశాలపైనే కూటమి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు మార్లు సమావేశం అయిన కూటమిలోని పార్టీలు నేడు మరోసారి ముంబైలో సమావేశం కానున్నాయి. .

ఈ సమావేశంలో చాలా అంశాలనే చర్చకు తీసుకొచ్చే అవకాశం ఉంది. 543 స్థానాలకుగాను ఏ ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలి ? సీట్ల పంపకాలు ఏ విధంగా జరగాలి అనే అంశాలను ప్రదానంగా చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంకా ప్రధాని అభ్యర్థి ఎవరు ఉండాలనే దానిపై కూడా తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అలాగే కూటమికి సంబంధించిన లోగోను కూడా నేడు ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. దాంతో నేడు జరిగే విపక్ష ఇండియా కూటమి సమావేశం దేశ రాజకీయల్లో చర్చనీయాంశం అయింది.

కాంగ్రెస్ పార్టీతో పాటు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, జేడీయూ, డీఎంకే వంటి ప్రధాన పార్టీలు కూటమిలో ఉండడంతో సీట్ల పంపకాలు ఎలా జరుగబోతున్నాయనేది చూడాలి. కాగా వీలైనంత త్వరగా సీట్ల విషయంలో తుది నిర్ణయానికి వచ్చే ఈ ఏడాది చివరి నుంచే కలిసికట్టుగా ప్రచారం మొదలు పెట్టాలనేది ఇండియా కూటమి ప్లాన్ గా తెలుస్తోంది. అయితే సీట్ల పంపకాల విషయంలో ఏ మాత్రం తేడా కొట్టిన కూటమిలో అంతర్గత కుమ్ములాటలు పెరిగే అవకాశం ఊంది. మరి వీటిని విపక్ష పెద్దలు ఎలా అధిగమిస్తారో చూడాలి.

Also Read:ఇప్పుడేందుకు ఈ కపటప్రేమ.. మోడీజీ !

- Advertisement -