జగన్ కు ఐప్యాక్ షాక్… నిజమేనా?

41
- Advertisement -

ఏపీలో ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలలు సమయం ఉన్నప్పటికి.. రాజకీయాలు ఇప్పటి నుంచే రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్న నేపథ్యంలో సర్వేలు ఇస్తున్న ఫలితాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పటికే చాలా సర్వేలు బయటకు రాగా కొన్ని సర్వేలు వైసీపీకే తిరిగి పట్టం కట్టాయి మరికొన్ని సర్వేలు టీడీపీకి అధికారాన్ని ఇచ్చాయి. దీంతో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది సర్వేలకు కూడా అంతుచిక్కని విషయంగా మారింది. కాగా గత ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని కచ్చితంగా అంచనా వేసిన ఐప్యాక్ సర్వే సంస్థ ఆపార్టీ విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సారథ్యంలో సాగే ఆ సర్వే నియోజిక వర్గాల వారీగా వైసీపీ విజయాన్ని గట్టిగానే పసిగట్టింది. దానికి తోడు పీకే వ్యూహాలు కూడా పక్కాగా ఫలించడంతో జగన్ కు తిరుగులేని విజయం లభించింది. కాగా ఈసారి కూడా వైసీపీ అధికారం కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. మొదటిసారి కంటే ఎక్కువగా ఈసారి ఏకంగా 175 స్థానాల్లో విజయం సాధించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఐప్యాక్ ఇస్తున్న రిపోర్ట్స్ మాత్రం వైసీపీని కంగుతినేలా చేస్తున్నాయట. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మూడే ఎంపీ సీట్లు లభిస్తాయని స్వయంగా వైసీపీ అధికార సర్వే సంస్థ ఐప్యాక్ వెల్లడించిందని ఇటీవల సోషల్ మీడియాలో ఓ వార్తా తెగ చక్కర్లు కొడుతోంది.

దీంతో వైసీపీలో కల్లోలం మొదలైందట. గత ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఐప్యాక్ పక్కాగా అంచనా వేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తా నిజమేనేమో అని ఆ పార్టీ శ్రేణులు కూడా భయపడుతున్నారట. అయితే వైసీపీకి మూడే సీట్లు అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తాము ఎలాంటి సర్వే నిర్వహించలేదని తమ సంస్థ పేరుతో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని స్వయంగా ఆ ఐప్యాక్ సంస్థనే క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ఆ మద్య బయటకు వచ్చిన ఇండియా సర్వేలో వైసీపీకి ఏడు స్థానలే రావోచ్చని అంచనా వేసింది. ఇక ఇప్పుడు ఐప్యాక్ పేరుతో వైసీపీ మూడు స్థానలే అని వార్తలు రావడం గమనార్హం.

- Advertisement -