సెకండ్ వేవ్..24 గంటల్లో 1,15,736 కరోనా కేసులు

25
covid

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,15,736 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 630 మంది మృతిచెందారు. మొత్తం కేసుల సంఖ్య 1,28,01,785కు చేరగా కరోనా నుండి ఇప్పటివరకు 1,17,92,135 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 8,43,473 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు కరోనాతో 1,66,177 మృతి చెందారు. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 8,70,77,474 డోసులు వేయగా ఇప్పటి వరకు 25.14కోట్ల టెస్ట్‌లు చేసినట్లు వైద్యశాఖ వెల్లడించింది.