యుకేలో ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ మార్చ్

214
Independence Day celebrations at London
- Advertisement -

ఇండియన్ హై కమీషన్ – లండన్  ఆధ్వర్యంలో 70వ స్వాతంత్ర వేడుకల సందర్బంగా   “ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ మార్చ్ ” నిర్వహించారు. లండన్ లోని పార్లమెంట్ స్క్వేర్ నుండి ప్రారంభమైన ర్యాలీ ఇండియన్ హై కమీషన్ కార్యాలయం వరకు సాగింది. భారత దేశం లోని వివిధ రాష్ట్రాలకు చెందిన వందలాది  ప్రవాస సంఘాల ప్రతినిధులు ఇందులో  పాల్గొని, లండన్ వీధులు “భారత్ మాతాకీ జై ” అంటూ మారుమోగాయి.

తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ ( టాక్)  సభ్యులు  ప్రాతినిధ్యం వహించి “జై భారత్ జై తెలంగాణ ” అంటూ మార్చ్ లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తర్వాత సమావేశం లో భారత హై కమిషన వైకే సిన్హా ప్రవాసులందరికీ స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, విదేశాల్లో ఉన్నపటికీ మాతృభూమి పై మీ ప్రేమ ఎంతో గొప్పదని, కార్యక్రమం వియజయవంతం చేసిన అందరికి కృతఙ్ఞతలు తెలిపారు.

Independence Day celebrations at London

టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం  మీడియాతో మాట్లాడుతూ గతం లో తెలంగాణ రాష్ట్ర సాధనకోసం లండన్ లో ఎన్నో ర్యాలీలు తీశామని, కానీ నేటి భారత స్వాతంత్ర వేడుకల సందర్బంగా ఏర్పాటు చేసిన “ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ మార్చ్ ” లో పాల్గొనడం చాలా గర్వాంగా ఉంది, బ్రిటిష్ గడ్డ పై భారత జెండా ఎగురవేసి ఇలా అర్ధ రాత్రి సంబరాలు చేసుకోవడం మరుపురాని అనుభూతినిచ్చింది తెలిపారు. అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస బిడ్డలందరిని ఒక్కదగ్గర ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆహ్వానించిన భారత హై కమిషన్ కి కృతఙతలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో హై కమీషన్ ప్రతినిధులు ఏయస్ రాజన్, విజయ్ వసంత, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, సభ్యులు నవీన్ రెడ్డి, అశోక్, రత్నాకర్, సత్య, రాకేష్, సత్యపాల్, రాజేష్ వాకా,ప్రవీణ్ వీర, రవి కిరణ్ , వెంకీ ,నగేష్ ,రాకేష్ ,నాగరాజు ,భరత్ ,సత్తి రెడ్డి ,నరేష్ ,రమ్మీ ,జకీర్ ,రవీందర్ రెడ్డి ,సాయి నితిన్ , మరియు ఇతర ప్రవాస సంఘాల ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొన్న వారిలో  ఉన్నారు.

- Advertisement -